అనకాపల్లి జోనల్ కమీషనర్ ని కలసిన కార్పొరేటర్ చినతల్లి నీలబాబు
అనకాపల్లి :
జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీమతి కనకమహాలక్ష్మి ఈరోజు ఉదయం 84 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి మాదంశెట్టి చిన్న తల్లి జీవీఎంసీ కార్యాలయంలో కలుసుకుని పుష్ప గుచ్చం అందించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. 84 వ వార్డు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యంగా పారిశుద్ధ్యం మంచినీరు కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాడాలని కరోనా వైరస్ మూలంగా ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కారణంగా ప్రజారోగ్య శాఖ అప్రమత్తం చేయాలని కాలువల పరిశుభ్రత మంచినీరు కలుషితం కాకుండా పైపులైన్లు కాలువలకు దగ్గరగా ఉన్న వాటిని మెరుగు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో 84వ ఇన్చార్జ్ మాదంశెట్టి బాబు మిత్తిపాటి గోపాలరావు రమణ తదితరులు పాల్గొన్నారు