ఎవెరెస్టు శిఖరం అదిరోహించిన తెలుగు తేజం అన్మిష్ వర్మ
గాజువాక :
అన్మిష్ వర్మ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించి ప్రపంచ రికార్డు సాదించిన అన్మిష్ వర్మ భూపతిరాజు కి విశాఖ విమానాశ్రయం లో గణ స్వాగతం పలికిన క్రీడా సంఘం ప్రతినిధులు కరణంరెడ్డి. నరసింగరావు ,శివాజీ ,శ్రీనివాసరావు ,దిలీప్ వర్మ తదితరులు. ఈ సందర్బంగా కిక్ భాక్సింగ్ సంఘం రాష్టృ గౌ.అద్యక్షులు కరణంరెడ్డి. నరసింగరావు మాట్లాడుతూ అన్మిష్ వర్మ గారు చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అదిరోహించడమే కాకుండా , గతంలో కిక్ బాక్సింగ్ మరియు కరాటే క్రీడలలో కూడ అంతర్జాతీయ స్తాయిలో బంగారు పతకాలను సాదించారని అన్నారు. విపత్కర సమయంలో ప్రతికూల వాతావరణంలో కూడా తన ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్టు శిఖరం అదిరోహించడం గొప్ప విషయమని , నేటి యువతకు ఆయన ఆదర్శమని కొనియాడారు. రాష్టృ ప్రభుత్వం వీరిని గుర్తించి క్రీడాకారుల కోటా లో ఉద్యోగం,ఇంటి స్తలం,50 లక్షల రూపాయల నగదు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు క్రీడా సంఘాల ప్రతినిధులు,యువకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అబినందించిన బీజేపి నేత కే.ఎన్.ఆర్. శివాజీ తదితరులు