ఐక్యతతో ఉంటే సాధించలేనిది ఉండదు: ఎమ్మెల్యే కొలగట్ల
విజయనగరం:
ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి, ఆర్యవైశ్యులు అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం విజయనగరం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోలగట్ల ను మంగళవారం నాడు తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోలగట్ల కు శాలువా కప్పి ఉచిత రీతిన సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ జిల్లా ఆర్యవైశ్య సంఘం ద్వారా ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతూ, ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్య కుటుంబాల కు అండగా నిలవాలన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడాలన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కుమ్మరిగుంట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోలగట్ల సలహాలు సూచనలతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల ను కలిసిన వారిలో సంఘం జిల్లా కార్యదర్శి విశ్వేశ్వరరావు, కోశాధికారి కుసుమంచి మహేష్ ,
పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెత్స సత్యనారాయణ మూర్తి, కిరాణా, మర్చెంట్ అస్సొసియెషన్ గౌరవ అధ్యక్షులు ఒబ్బిలిశెట్టి రాంజీ ,అయ్యప్ప స్వామి దేవాలయం చ్తేర్మన్ కట్ట మూరీ శంకరావు తదితరులు పాల్గొన్నారు.