జులై 1న మన్యం బంద్..మావోయిస్టు పార్టీ లేఖ
కొయ్యూరు :
ఈ నెల 16న కొయ్యూరు మండలం యు చీడిపాలెం పంచాయితీ తీగలమెట్ట అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులకు ఆత్మ శాంతి కలగాలని, అదేవిధంగా ఎన్ కౌంటర్ కు నిరసనగా జులై 1న మన్యం బంద్ నిర్వహిస్తున్నామని సిపిఐ మావోయిస్టు ఏవోబి ఎస్ జేడ్ సీ కార్యదర్శి గణేష్ శనివారం లేఖ విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, విశాఖ ఏజెన్సీ లో విలువైన ఖనిజ సంపదను పట్టుకో పోవడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. మన్యం లో ఉన్న ఖనిజ సంపదను అడ్డుకుంటున్న ఏకైక పార్టీ మావోయిస్టు పార్టీ అని, తమ పార్టీని మన్యంలో కనిపించకుండా చెయ్యాలని సదుద్దేశంతో తమ పార్టీ నాయకుల పై పోలీసులను పంపుతున్నాడని అందులో భాగంగానే కొయ్యూరు మండలం యు చీడిపాలెం, తీగల మిట్ట అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపించారని ఆ లేఖలో పేర్కొన్నారు.