తమను రెగ్యులర్ చేయరూ!
చింతపల్లి:
కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్, పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని స్థానిక ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి వైద్య సిబ్బంది డిమాండ్ చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ లు వసంత, ఊర్వశి, మంగ, ల్యాబ్ టెక్నీషియన్ అనిల్, షారూక్, ఫార్మసిస్ట్ లు గౌరీశంకర్, భీమేశ్వరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
(Visited 67 times, 1 visits today)