దేవాలయాల ఈఒ లతో దేవాలయల అభివృద్ధి కొరకు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు సమీక్ష
అనకాపల్లి :
అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో గల వివిధ దేవాలయాల ఈఒ లతో దేవాలయల అభివృద్ధి కొరకు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ శ్రీమతి బి వి సత్యవతి విష్ణుమూర్తి క్యాంపు కార్యాలయంలో సమీక్షలో పాల్గొన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ప్రసాద్ పధకం ద్వారా దేవాలయ అభివృద్ధి కొరకు కేంద్ర మంత్రికి గతంలోనే లేఖ రాశారని అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా సహాయం కోరడం జరిగిందని ఆమె తెలిపారు, దేవాలయ అభివృద్ధి కొరకు ప్రణాళికలు శరవేగంగా సిద్ధం చేయాలని అనకాపల్లి ఎంపీ సత్యవతి అధికారులను ఆదేశించారు. రేపు జరిగే పార్లమెంటు సమావేశాల్లో దేవాలయాల అభివృద్ధి పై చర్చిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నూకాంబిక దేవస్థానం ఈవో నాగేష్ , కశింకోట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈవో ఆదినారాయణ, అప్పికొండ దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, పంచదార్ల శివాలయం దేవస్థానం ఈవో సాంబశివరావు, దేవాదాయ శాఖ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు