ప్రజల ముంగిటే వైద్యం: ఎమ్మెల్యే కొలగట్ల
విజయనగరం :
ప్రజల ముంగిటకే వైద్య సదుపాయం అందించేందుకు నగరంలో ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు విజయనగరం నియోజకవర్గ శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. మంగళవారం నాడు నగరంలోని ఎల్ బి కాలనీ మరియు స్టేడియం పేట కాలనీ ప్రాంతాలలో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 7 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 5 ప్రాంతాలలో శంకుస్థాపనలు పూర్తి చేశామన్నారు. 80 లక్షల రూపాయలు వెచ్చించి ఒక్కొక్క ప్రాథమిక కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పేద, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. 10 పడకల సామర్థ్యం గల ఆసుపత్రులను నిర్మించి అక్కడే ప్రసవాలు జరిగే విధంగా సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీలకు అనుకూలంగా ఉండే విధంగా, సమీప ప్రాంతాలలో నెలకొల్పడం మంచి పరిణామం గా భావిస్తున్నామన్నారు. 2004 – 09 కాలంలో తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నగరం లో 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి వెంపడాపు విజయలక్ష్మి, 29వ డివిజన్ కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి, ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ, అయా డివిజన్ల కార్పొరేటర్లు బోనెల ధనలక్ష్మి, షేక్ జకీర్ హుస్సేన్ పట్నాన పైడ్రాజు,వింత ప్రభాకర్, కో ఆప్షన్ సభ్యుడు రహీం, జోనల్ ఇంచార్జ్ లు విజయ శంకర్ డుబె, లక్ష్మణ్ తమ్ము, సంఘం రెడ్డి బంగారు నాయుడు, బొద్దాన అప్పారావు, రెడ్డి గురుమూర్తి, నగరపాలక సంస్థ ఈఈ డాక్టర్ కిల్లాన దిలీప్,డిఈ అప్పారావు , ఆయా డివిజన్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.