ప్రజాభిప్రాయం తీసుకొనే మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి: పైడారావు
అనకాపల్లి :
మాస్టర్ ప్లాన్ రూపొందించేటప్పుడు ముందు ప్రజా ప్రతినిధులు రైతులు ప్రజల అభ్యంతరాలను ముందుగా తీసుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఇప్పటికైనా జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రజల తాలుక పంటపొలాలను మాస్టర్ ప్లాన్ లో ఎక్కువగా ఇండస్ట్రియల్ జోన్ కారిడార్లు ఇతర అవసరాల కోసం ఎక్కువ స్థలాలు కేటాయించడం వల్ల పంట పొలాలు రైతులు చాలా నష్టపోతారని ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అనకాపల్లి వ్యవసాయ దారుల సంఘం ఉపాధ్యక్షులు విల్లూరి పైడారావు అన్నారు
కనీసం నియోజకవర్గ స్థాయిలో నైనా సమావేశం ఏర్పాటు చేసి అభ్యంతరాలు తీసుకోవాలని పంటపొలాలను మాస్టర్ ప్లాన్ లో ఇతర మార్గాలు తీసుకుంటే రైతుల నుంచి తిరుగుబాటు తప్పదని విల్లూరి పైడారావు అన్నారు అధికారులు చేస్తున్న తప్పులకు ప్రజలు ప్రజలు నష్టపోకూడదనే విషయం ప్రజా ప్రతినిధులు కూడా తెలుసుకోవాలని వారు కూడా ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలియ పరచాలని విల్లూరి పైడా రావు కోరారు