బిల్లులు వచ్చే విధంగా కృషి చేయాలి: ఉగ్గిని
ఈరోజు ఉదయం పరవాడ పాలెం గ్రామంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ తెలుగురైతు జిల్లా ప్రధాని కార్యదర్శి ఉగ్గిని రమణమూర్తి స్వగృహంలో ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు కలుసుకొని బిల్లులు వచ్చే విధంగా కృషి చేయాలని మెమోరాండం సమర్పించినవారు కలగా సోమేశ్వర రావు బుద్ధి రెడ్డి గంగయ్య కర్రీ దుర్గి నాయుడు కోన రమణ ఎస్ కే బాబర్ కలుసుకొని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జాతీయం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం ప్రతిపాదించిన వివిధ రకాల పనులను చేసి ఉన్నారని రాజకీయ కక్షతో గత రెండు సంవత్సరాల నుండి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా కరోనా వైరస్ రావడం దీనిమూలంగా వ్యవసాయ పనులు లేకపోవడం కుటుంబ పోషణకు కూడా నానా ఇబ్బందులు పడుతున్నరని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు నవరత్నాలకు మళ్లించారని ఆనాడు చేసిన పనులకు ఏవో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ కమిటీల పేరుతో విచారణ చేసి అవినీతి జరిగిందని కుంటిసాకులతో రాజకీయ కక్షతో వేధిస్తున్నారని రమణ మూర్తి తెలిపారు జిల్లా వ్యాప్తంగా 39 మండలాల్లో 150 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు చెల్లించవలసి ఉన్నదని ఇది కాకుండా గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు 500 కోట్ల పైబడి చెల్లించవలసి ఉందని ఒక్క కశింకోట మండలం లో ఐదు కోట్ల పైబడి బకాయిలు ఉన్నాయని రమణ మూర్తి తెలిపారు. ఇకనైనా కక్షసాధింపు చర్యలు విడనాడి వెంటనే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని రమణమూర్తి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో వైసీపీ కార్యకర్తలు పనులు చేస్తున్నారని భవిష్యత్తులో వారికి ఇటువంటి పరిస్థితి వస్తుందని గమనించాలని ప్రస్తుతం ఎనిమిది వారాల నుండి కూలీలకు జిల్లా వ్యాప్తంగా బకాయిలు చెల్లించకపోవడంతో వల్ల 150 కోట్లకు చేరుకుందని ఉపాధి చట్టం నిబంధనల ప్రకారం పనిచేసిన 15 రోజుల్లో కూలీలకు చెల్లించవలసి ఉన్నప్పటికీ చెల్లించక పోవడం వల్ల వడ్డీతో సహా చెల్లించాలని రమణమూర్తి డిమాండ్ చేశారు