మత్స్యకార నేత గంట పాపారావు కన్నుమూత
విశాఖపట్నం:
మత్స్యకార నాయకుడు,న్యాయవాది, మత్స్యకారుల మాస పత్రిక సంపాదకుడు, ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన గంట పాపారావు కన్నుమూశారు.గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన నగరంలోని
ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
తుది శ్వాస విడిచారు. న్యాయవాదిగా కొనసాగుతూ సమాజంలో అణగారిన వర్గాల పక్షాన నిలిచి అనేక పోరాటాలు సాగించారు.
ప్రధానంగా గంగవరం పోర్ట్ నిర్వాసితుల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ కలాన్ని ఎక్కుపెట్టారు. మత్స్యకారుల ఎస్టీ సాధన కోసం
అలుపెరుగని పోరాటాన్ని సాగించారు. ఆయన అకాల మరణం మత్స్యకారులు, ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు తీరని లోటుగా అభివర్ణించవచ్చు.
(Visited 14 times, 1 visits today)