మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: వెంకటగిరి
చింతపల్లి:
జికె వీధి మండల పరిధి సీలేరు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నత పాఠశాలలో సహో పాధ్యాయునిగా పనిచేస్తూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన కిరసాని విశ్వనాథం కుటుంబాన్ని పాడేరు ఐటీడీఏ ఉన్నతాధికారులు ఆదుకోవాలని పిఆర్ టియు జిల్లా ఉపాధ్యక్షుడు యువి గిరి ఆదివారం అన్నారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేతనాలు అందలేదని ఆయన ఆరోపించారు. నేడు ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిలో చేరి విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయునికి గడచిన 9 నెలలుగా వేతనాలు అందకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు.
(Visited 165 times, 1 visits today)