యారడ గ్రామంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు
పెద గంట్యాడ ( యారాడ):
గాజువాక 64 వార్డ్ యారాడ గ్రామం 1సంవత్సరం నుండి 5 సంవత్సరాలు పిల్లలకు ఆధార్ నమోదు సెంటర్ ని వార్డ్ అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాసరావు సహకారం తో యారాడ యూత్ బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమ నికి ముఖ్య అధితులు గా గాజువాక వైసీపీ ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి ఆయన చేతులు మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమన్ని ఏర్పాటు చేసినటువంటి వార్డ్ అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాసరావు కి నా హృదయపూర్వక అభినందనలు అని అన్నారు. ఆయన ఎన్నో సవంత్సరాలు నుండి ఈ యొక్క 64 వార్డ్ లో అనేక మంచి కార్యక్రమలు చేపడుతూ ఉన్నారు అని ఇటువంటి వ్యక్తి మీకు దొరకడం మీ వార్డ్ అదృష్టం అని అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి లు లో ప్రతి సంక్షేమ పధకానికి కానీ అవసరం నిమిత్తం గాని ఆధార్ ఎంతో అవసరం అని ఆయన అన్నారు. మనిషి నిత్య అవసరం లో ఒక భాగంగా ఆధార్ అవసరం ఏర్పడింది అని ఆయన చెప్పికొచ్చారు.
ఈ కార్యక్రమం లో ప్రవీణ్, అశోక్, వల్లి, గోవింద్, గోపి, రమేష్, యూత్ బాయ్స్, గ్రామ పెద్దలు , యువకులు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.