రాష్ట్రంలో డమ్మీలుగా డీఎంహెచ్ఓలు: భీశెట్టి

అనకాపల్లి:

జీఓ 64ను ముఖ్యమంత్రి రద్దు చెయ్యాలి!!
రాష్ట్రంలో ని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ప్రతిజిల్లా లో ఉండే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల(డీఎంహేచ్ఓ)ను డమ్మీలుగా చేసి వారి అధికారాలను,వారి పరిపాలన వ్యవస్థని జిల్లాలో ని జేసి లకు ధారాదత్తం చెయ్యడానికి ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబర్ 64 ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే రద్దు చేయాలని లోక్సత్తాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైద్యుల హక్కులు ను నిర్వీర్యం చెయ్యడమే కాకుండా అన్నిరకాల బాధ్యతలను ఐఏఎస్ లకు అప్పగించడం వైద్య వృత్తిని, వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం అవమానించడమేనని ఐఏఎస్ చదివినంత మాత్రాన వైద్య వృత్తిలో ని కీలక సమస్యలు వారికి ఏమి అవగాహన ఉంటుందని ప్రభుత్వం ని ప్రశ్నించారు, వైద్య విద్య,వైద్య ఆరోగ్య కుటుంభం సంక్షేమ శాఖ, జిల్లా రాష్ట్ర అధికారుల అధికారాలను పూర్తి విఘాతం కలిగేలా ప్రభుత్వం వ్యవహారించవద్దని,పీసీ అండ్ పిఎన్డీటీ యాక్ట్,క్లినికల్ ఎస్టాబ్లిస్మెంట్ యాక్ట్, ఫుడ్ సేఫ్టీ యాక్ట్,కింద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఎన్నో అధికారాలు సంక్రమించాయని ఇది మరచిపోయిన ప్రభుత్వం వైద్యుల ఏసీఆర్ లపై ఐఏఎస్ లకు అధికారాలు ఇస్తూ డీసీహెచ్ ఎస్,బోధనాస్పత్రుల సుపరెండెంట్లు,మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు,ఎన్ హెచ్ ఎమ్, ఆయుష్ శాఖలకు చెందిన అధికారాలు కూడా జేసీ లకు ధారాదత్తం చెయ్యడం మంచిదికాదని భీశెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరారు,కనీసం 30 ఏళ్ల అనుభవం ఉంటేనే గాని వైద్య శాఖలో జిల్లా అధికారుల స్థాయి కి డాక్టర్లు వస్తారని,వైద్య,శస్త్ర చికిత్సలు పట్ల వారికుండే అనుభవం ఐఏఎస్ జేసి లకు ఎలావుంటుందని, జిల్లా అధికారులు పని మానేసి ప్రతి చిన్న పనికి, అనుమతుల కోసం జేసి ల చుట్టూ గంటలకొద్దీ పడిగాపులు పడటం మంచి పద్ధతి కాదని దీనివలన పరిపాలన కుంటుపడుతుందని ప్రభుత్వం వెంటనే 64 జీఓ ని రద్దు చేయాలని ప్రభుత్వ డాక్టర్ల గౌరవం పెరిగేలా చూడాలని భీశెట్టి ప్రభుత్వం ని డిమాండ్ చేశారు.

(Visited 177 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.