వర్షాలకు కుప్ప కూలిన అనకాపల్లి తహశీల్దారు కార్యాలయం
అనకాపల్లి :
తహశీల్దారు చాంబర్ లో కూలిన పై కప్పు త్రూటిల
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సోమవారం అనకాపల్లి తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ పాక్షికంగా కూలిపోయింది. ఆ సమయంలో తాసిల్దార్ కె శ్రీనివాసరావు తన సీటులో లేకపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ కార్యాలయం నిర్మించి సుమారుగా 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పలుమార్లు తాసిల్దార్ కార్యాలయం వద్ద మరమ్మతులు చేపట్టి విధులను కొనసాగిస్తున్నారు. తాసిల్దార్ కార్యాలయం నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు పంపినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. నేపథ్యంలో రెవెన్యూ అధికారులు శిథిలావస్థలో ఉన్న ఈ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి నిత్యం వందలాది మంది తాసిల్దార్ కార్యాలయం పనులు మీద వచ్చి పోతుంటారు. తెల్ల వారే ఈ సంఘటన చోటు చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ కార్యాలయంలో అధికారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి శిధిలావస్థలో ఉన్న అనకాపల్లి తాసిల్దార్ కార్యాలయం ని తొలగించి పూర్తి స్థాయిలో నిర్వహించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.