సాధనదీక్ష వాల్ పోస్టర్లను విడుదులచేసిన: మాజీ ఎమ్మెల్యే పీలా
అనకాపల్లి :
29న కరోనా మృతులను ఆదుకోవాలని సాధనదీక్షా.
కరోనా మృతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలం.
కరోనా మృతులను ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల” 29 న ఒక్కరోజు సాధనదీక్ష” చేయనున్నట్టు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి” శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు” తెలిపారు.కరోనా బాధితులను ఆదుకోవడంలో “వైకాపా ప్రభుత్వం విఫలమైందని” ఆరోపించారు.రాష్ట్రంలో తెల్లరేషన్ దారులందరికి “10వేలు ఆర్ధికసహాయం చేయాలని కోరారు.”కరోనామృతులకు 10లక్షలు ఇవ్వాలని” ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ రోజు ఈ నెల 29న కరోనా బాధితుల డిమాండ్లను అమలు చేయాలని “టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్న సాధనదీక్ష వాల్ పోస్టర్లను” ఆయన పార్టీ కార్యాలయంలో విడుదుల చేశారు.కరోనా బాధితులకోసం పది డిమాండ్ల అమలు కోసం తెలుగుదేశం పార్టీ ఎంతవరకైనా పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఉఫాధ్యక్షులు మళ్ళ సురేంద్ర, నడిపల్లి గణేష్, పొలారపు త్రినాధ్,శెట్టి వెంకటరమణ,సబ్బవరపు గణేష్, దాడి జగన్, కాండ్రేగుల రాజు,చదరం శివ అప్పారావు,కోరాడ మహేష్,బత్తుల శ్రీనివాసరావు,వేగి పరమేశ్వరరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.