నాటు సారా నిర్మూలన కోసం నడుం బిగించిన యువత

(కశింకోట):

 

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేసింది కరోనా కారణంగా గత ఏడాదిన్నర నుంచి పనుల్లేక అలాగే ఎక్కడ ఉపాధి అవకాశాలు లేక జీవనోపాధి కష్టం కావడంతో గ్రామంలోని కొందరు యువకులు బతుకుతెరువు కోసం నాటు సారా తయారీ ఎంచుకున్నారు.కశింకోట మండలం బయ్యవరం గ్రామానికి చెందిన కొందరు యువకులు నాటు సారా తయారీ స్థావరాలను ఏర్పాటు చేసి సారా తయారీ చేపట్టారు. నాటుసారా వ్యాపారం ఆశాజనకంగా ఉండటంతో ఈ వృత్తిలోనే కొనసాగడం మొదలెట్టారు. దీంతో గ్రామానికి చెందిన కొందరు నానాజీ,అప్పారావు, అమ్మిశెట్టి లక్ష్మణ్ కుమార్,ఆర్మీ ఉద్యోగి చిన్ని నాగేష్ తదితరులు ‘నేను సైతం’ అనే నినాదంతో ఒక సంఘాని ఏర్పాటు చేసారు.పెడదారి పడుతున్న యువకులను వారి ఆలోచనలను మళ్ళించాలని ఉద్దేశంతో ‘నేను సైతం’ అనే నినాదంతో గ్రామంలో ఒక సంఘంగా ఏర్పాటు చేసామని గొన్నాబత్తుల నానాజి అన్నారు. నాటుసారా తయారీ అలాగే సారా విక్రయాలు జరగకుండా అవగాహన సదస్సులను గ్రామంలో నిర్వహించారు. అలాగే గ్రామంలోని పెద్దలు సహకారం తీసుకొని ముందుకు సాగారు. గ్రామంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అలాగే మద్యం రహిత గ్రామంగా చూడాలని ధ్యేయంగా గ్రామంలోని ఉద్యోగులు శంఖారావం పూరించారు. నాటుసారా నియంత్రణ కోసం గ్రామ సచివాలయంలో ఈ యువకులు ఒక వినతి పత్రం ఇవ్వడమే కాకుండా సారా అమ్మడం అలాగే తయారుచేయడం నిషేధం అంటూ గ్రామంలో దండోరా వేయించారు. నిన్నటి వరకు ఇద్దరితో ప్రారంభమైన ఈ సంఘం నేడు సుమారుగా వంద మంది యువకులు ‘నేను సైతం’ గ్రూపులో చేరి మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. గ్రామాల్లో యువకులు చేస్తున్న పనుల పట్ల పెద్దలు కూడా దిగి వచ్చి వీరి పోరాటానికి అండగా నిలిచారు. గ్రామంలో విచ్చలవిడిగా తయారయ్యే యువకుల కృషి ఫలితంగా గ్రామంలో నాటుసారా స్థావరాలు నేడు మూతపడ్డాయి. కానీ కొంతమంది బయటనుంచి నాటుసారా తీసుకువచ్చి అమ్ముతున్న విషయాన్ని యువకులు గుర్తించారు. ఎలాగైనా గ్రామంలో నాటు సారా అమ్మకాలను కట్టడి చేయాలని ఈ మేరకు వీరు ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు అలాగే నాటుసారా అమ్మకాలకు వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించడానికి ఈ సంఘం తీర్మానం చేసింది. గ్రామంలో యువకులు చేస్తున్న మంచి పనికి మంచి ఫలితాలు రావాలని గ్రామస్తులు ఆశిస్తున్నారు.

(Visited 476 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *