వ్యవసాయం, ఆరోగ్యం రెండు కళ్లు
ఎమ్మెల్యే అమర్నాథ్
అనకాపల్లి: అటు వ్యవసాయం..ఇటు ఆరోగ్యం ప్రభుత్వానికి రెండు కళ్లు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చెప్పారు. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ నేపథ్యంలో అమర్నాథ్ ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. ఆర్‌ఏఆర్‌ఎస్ ఉనికికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పరిశోధనలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందరికీ అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎవరు ఎటువంటి అపోహలకు పోవద్దని సూచించారు. అనకాపల్లికి ప్రతిష్టాత్మకంగా ఈ రెండు ఉండబోతున్నయని చెప్పారు. అనంతరం పరిశోధనాస్థానంలో చేపడుతున్న పలు నిర్మాణాలను వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి పలకా రవి తదితరులు పాల్గొన్నారు.