ఆర్ఎఆర్ఎస్ లో ఆగ్రో ప్రోసెసింగ్ సెంటర్ : డాక్టర్ జగన్నాథ రావు
అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్దానం లో ఆగ్రో ప్రోసెసింగ్ సెంటర్ నెలకొల్పామని ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పివికె జగన్నాథ రావు తెలిపారు. అపరాలు, చిరు ధాన్యాలు వరి ప్రోసెసింగ్ యంత్రాలతో పాటు సోంపు,అల్లం,ఉసిరి పై బెల్లం పూత వేసె యంత్రం బెల్లం, తేనే శుద్ధి చేసే యంత్రం చిప్స్ తయారు చేసే యంత్రం అన్ని పంటల గింజలను శుద్ది చేసే యంత్రం కూడా ఈ కేంద్రం లో ఉన్నాయని అన్నారు. బిస్కట్ లు,నూడిల్స్,కేక్ లు తయారు చేసేందుకు ఉపయోగపడే యూనిట్ ఇక్కడ ఉందని చెప్పారు. రైతులకు ఆగ్రో ప్రోసెసింగ్ పద్దతులపై శిక్షణ ఇస్తామని ఇక్కడ రైతులు తమ ఉత్పత్తులను ప్రోసెసింగ్ చేసుకునేందుకు అద్దె ప్రాతిపదికపై అవకాశం కల్పిస్తామని చెప్పారు.
రైతులు అపరాలు, చిరు ధాన్యాలు, నూని గింజలను పండించి ఆ వెంటనే విక్రయించడం వలన తగిన ధర లభించడం లేదు.ఈ ఉత్పత్తులను ప్రోసెస్ చేసి అమ్మి నట్లు అయితే నలబై శాతం అదనంగా ఆదాయం లభిస్తుందని జగన్నాథరావు చెప్పారు. తమ విభాగంలో చిరు ధాన్యాల దోశ మిక్స్ తదితర ఆహర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నామని తెలిపారు. అమెజాన్ తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. తమ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు.