అనకాపల్లి వాసవీ క్లబ్ రూరల్ అధ్యక్షుడిగా తమ్మన సుబ్రహ్మణ్య గుప్త

అనకాపల్లి  :

 

 

 

అనకాపల్లి రూరల్ వాసవీ క్లబ్ అధ్యక్షునిగా తమ్మన సుబ్రహ్మణ్య గుప్త ఆదివారం ప్రమాణ స్వీకారం చేసారు. స్దానిక రోటరీ కళ్యాణ మండపం లో జరిగిన ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గా దొండ పాటి సత్యనారాయణ, కోశాధికారి గా కర్ణాటకపు ఆనంద్ లు ప్రమాణ స్వీకారం చేసారు. అలాగే వనిత క్లబ్ అధ్యక్షురాలిగా పువ్వాడ సుజాత,కార్యదర్శి గా నాగుమల్లి నూకరత్నం,కోశాధికారి గా పచ్చిగోళ్ల మహాలక్ష్మి లు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ విజ్జపు మల్లేశ్వర రావు, కాబినెట్ కార్యదర్శి మధు,కాబినెట్ కోశాధికారి స్వామి,వైస్ గవర్నర్ నరసింహారావు, గవర్నర్ పులపర్తి వరహలు,మాజీ గవర్నర్ శ్రీనాదు శ్రీను, రీజనల్ చైర్మన్ భరత్ కుమార్, వాసవీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

(Visited 197 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.