ఈసీకి మ‌తి భ్ర‌మించిందా?

వ‌లంటీర్ల ఫోన్లు స్వాధీనానికి ఆదేశాలా?
వారి ఓటు హ‌క్కు తీసేస్తేరేమో
చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో నిమ్మ‌గ‌డ్డ‌
ప్ర‌జ‌ల‌ను ఇబ్బందిపెట్టే ఆలోచ‌న‌లు మానుకోవాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాడి వీర‌భ‌ద్ర‌రావు

అన‌కాప‌ల్లి : హైకోర్టు వారి ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధానపరమైన ఎట్టి ఉత్తర్వులు జారీ చేయకుండా నియంత్రించాల‌ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాడి వీర‌భ‌ద్ర‌రావు కోరారు. వ‌లంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవ‌ల‌సిందిగా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు ఇవ్వ‌డం చూస్తుంటే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు మ‌తిభ్ర‌మించిందా అనే అనుమానం క‌లుగుతోంద‌న్నారు. ప్ర‌జ‌లు సేవ చేసే వ‌లంటీర్ల‌ను అనుమానించ‌డం త‌గ‌ద‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 2,60,000 మంది వ‌లంటీర్ల‌ను దొంగ‌లుగా, దోపిడీదారులు వాళ్ల‌పై నిఘా పెట్ట‌డం, వాళ్లు ఫోన్లు స్వాధీనం చేసుకునే చ‌ర్య‌లు చ‌ట్ట‌బ‌ద్ధ‌మేనా అని ప్ర‌శ్నించారు. రెండు రోజులు పోతే వ‌లంటీర్ల ఓటు హ‌క్కును కూడా తొల‌గించాల‌ని ఆదేశిస్తారేమోన‌న్న అనుమానం క‌లుగుతుంద‌న్నారు. వ‌లంటీర్ల‌కు పోన్లు లేక‌పోతే బ‌యోమెట్రిక్ విధానంలో ప్ర‌జ‌ల‌కు అందే సేవ‌ల‌కు విఘాతం క‌లుగుతాయి.ప్ర‌జ‌లను ఇబ్బంది పెట్టే విధంగా ఏ చట్టం లేదు..కోర్టులు కూడా అదే విష‌యం ప‌దేప‌దే చెబుతున్నాయి. వ‌లంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని కేవలం గౌరవ భృతి తీసుకుని ప్రజా సేవ చేస్తున్నారని జాతీయ స్థాయి సంస్థలన్నీ అభినందిస్తున్నాయ‌న్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు వాలంటీర్ లకు వర్తించవనే ఇంగిత జ్ఞానం కూడా కమిషన్ కు లేదు. ఓటరు స్లిప్పులు పంచోద్దని వారిపై ఆంక్షలు విధించారు. రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవే ఆంక్షలు విధించవొచ్చు. ఈ విధంగా ఎప్పటికప్పుడు న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులు ను జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ లను ఎన్నికల కార్యక్రమాన్ని సజావుగా చేసుకోకుండా వారిని హింసిస్తున్నాడ‌న్నారు. స్థ‌నిక సంస్థ‌ల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి ఎన్నికల కమిషన్ ఎన్నికల ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. తానిచ్చిన సర్టిఫికెట్లపై తానే విచారణ జరిపించడానికి పూనుకోవడం చూస్తే ఇతను ఎన్నికల కమిషనరా లేక రాజకీయ రాబందా అనిపిస్తోంది. వీరిని ముందుపెట్టి తెరవెనుక నుండి నడిపిస్తున్న చంద్రబాబు వైఖరి మారలేదు. యన్టీఆర్‌ ,వైయ్.రాజశేఖర రెడ్డి హయాంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి 55 శాతం నుండి 65 శాతం వరకు మాత్రమే సీట్లు వచ్చాయి. ఈ70 ఏళ్ల చరిత్రలో సర్పంచ్ ఎన్నికల లో 80 శాతాన్ని మించి గెలుపొందిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చరిత్రాత్మక విజయం, చివరికి తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో కూడా ప్రజలు చంద్రబాబు కు ఊహించని చావుదెబ్బ కొట్టారు, ఇప్పటికైనా కుయుక్తులతో రాజకీయం చేయకుండా తన పార్టీని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామిక పద్ధతుల్లో చంద్రబాబు రాజకీయం చేస్తే మంచిది. లేకపోతే రాష్ట్రంలో మొన్న తమకు వచ్చిన 23 సీట్లు కూడా పోవడమే కాకుండా కుప్పంలో తాను కూడా ఎమ్మెల్యే గా ఓడిపోవడం ఖాయం.

(Visited 281 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *