దాడికి పాల్పడిన ఇరువురికి శిక్షపడే వరకు పోరాటం ఆగదు

చింతపల్లి:

మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిముడు రాజం నాయుడుపై బుధవారం ఇరువురు వ్యక్తులు దాడిచేసి గాయపరిచినందుకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో మండలంలోని పలు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు స్థానిక డిగ్రీ కళాశాల నుంచి హనుమాన్ కూడలి వరకూ పలు నినాదాలు చేస్తూ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు పై దౌర్జన్యంగా భౌతిక దాడి చేసి గాయపరచిన వారి పై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసిల్దార్ వివివి గోపాలకృష్ణ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి పై దాడి చేసి గాయపరచడం క్షెమించరాని నేరంమన్నారు. సాటి ఉద్యోగిగా ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టనని, కఠినమైన శిక్ష పడేటట్టు చూసే బాధ్యత తనపై ఉందన్నారు. పోలీసు శాఖ ఎఫ్ఐఆర్ కాఫీ ఇవ్వగానే దానిని జత చేసి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు. జరిగినదానికి విచారిస్తున్నానన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, జెఏసి నాయకులు, విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు.

(Visited 119 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *