ఏయూ వైఎస్సార్ విద్యార్థి విభాగం ఏర్పాటు

విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయం వైఎస్‌ఆర్‌ విద్యార్థి విభాగం ఏర్పాటు చేయడంపై విద్యార్థులు
హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఏయూ వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దపెద్ద ఎత్తున‌ వేడుకలు జరిపారు. ముందుగా ఏయూలోని మహానేత వై.ఎస్‌ రాజశేఖరరెడ్ది విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి వై. ఎస్‌జగన్‌ మోహన రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. నూతన కమిటీ ఏర్పాటుపట్ల ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన రెడ్డికి, ఎంపీ వి.విజయ సాయి రెడ్డికి,నగర అధ్య‌క్షులు వంశీక్రిష్ట శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
యువత మాట్లాడుతూ యువతంతా ముఖ్యమంత్రి వై. ఎస్‌ జగన్‌ మోహన రెడ్డి వెంట నిలుస్తుందని నినదించారు.

యువతకు ఉపయుక్తంగా ముఖ్యమంత్రి చేపట్టినకార్యక్రమాలు నిలుస్తున్నాయన్నారు. ప్రతీ కుటుంబం నుంచి విద్యావంతులు వచ్చే దిశగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన వంటి విభిన్న పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు నిర్వహిస్తున్న ప్రతీ పథకం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తున్నాయన్నారు. టపాసులు
కాల్చి, బైక్‌ ర్యాలీ జరిపారు. కార్యక్రమంలో ఏయూ విభాగం కార్యదర్శి బి. హేమచంద్‌ నాయుడు, రాష్ట్ర కార్యదర్భులు ఎం.కళ్యాణ్‌, ఎం.సురేష్‌ డీన్‌ టి.షారోన్‌ రాజు, వఏయూఇయూ అద్యక్షులు డాక్టర్‌ జి.రవికుమార్‌,ఉమా బసవేశ్వర రావు యాదవ్‌, ఎన్‌. చాణక్య, పి.దుర్గా ప్రసాద్‌, సంతోష్‌ జశ్వంత్‌, ఎం. వర్మ పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

(Visited 15 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *