బలార్క్ ధాబాలో యువకుడిపై పిడిగుద్దులతో దాడి
లంకెలపాలెం :
అనకాపల్లి జిల్లాలో ప్రధానమైన లంకెలపాలెం కూడలి సమీపంలో ఉన్న బలార్క్ ధాబాలో భోజనం చేయడానికి వచ్చిన యువకులకి యాజమాన్యం పిడుగుద్దు లతో దాడికి పాల్పడ్డారు. భోజనాని
కి వచ్చిన యువకుడిపై దౌర్జన్యం పాల్పడడంతో దాబా యాజమాన్యంపై అగ్ర వ్యాసాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా ఇక్కడ దాబాలో మద్యం త్రాగెందుకు అనుమతి ఉండటం వలన కూడా ఇటువంటి గొడలు తలెత్తుతున్నాయని స్దానికులు అంటున్నారు. కస్టమర్లను సంతృప్తి పరచాల్సింది పోయి గాయపరచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిబంధనకు విరుద్ధంగా నిర్వహిస్తున్న దాబాను మూయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
(Visited 1,159 times, 1 visits today)