సంక్షేమ కార్యక్రమాల అమలులో బ్యాంకర్లదే కీలక పాత్ర

జిల్లాను ముందుంచడం లో సహకరించాలి

డి.సి.సి సమావేశం లో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్

విజయనగరం: ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. బ్యాంకు అధికారులు అనుకుంటే సాధించగలరని, అనేక అంశాల్లో జిల్లా ముందుందని, ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల్లో కూడా జిల్లా ముందుండేలా సహరింహలని కోరారు. శుక్రవారం కలక్టరేట్ సమావేశ మందిరం లో జగనన్న తోడు, వై.ఎస్.ఆర్ బీమా, వై.ఎస్.ఆర్ చేయూత పధకాల పై ప్రత్యెక డి.సి.సి నిర్వహించారు. ఈ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న తోడు పధకం లో జిల్లా వెనకబడి ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. 31 వేల దరఖాస్తులను ఆమోదించగా 875 మందికి మాత్రమే ఇంతవరకు రుణాలు అందజేయడం జరిగిందని, వెనకబాటుకు కారణాలేంటని బ్యాంకు వారీగా ప్రశ్నించారు. బ్యాంకు వారీగా లక్ష్యాలను కేటాయిస్తూ సోమవారం నాటికీ కనీసం 50 శాతం గ్రౌన్దింగ్ జరగాలని అన్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు వారి దిగువనున్న మేనేజర్ లకు వెంటనే ఆదేశాలు జారి చేసి వచ్చే మూడు రోజుల్లో దీనిపైనే దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ నెల 8న ముఖ్యమంత్రి గారి సమీక్ష ఉన్నందున ఆ రోజుకు మొదటి మూడు స్థానాల్లో నిలపాలని కోరారు. వై.ఎస్.ఆర్ బీమా లో ముందున్నప్పటికీ ఆశించినంతగా పురోగతి లేదని అన్నారు. బ్యాంకులలో 5 లక్షల 17 వేల మందికి బీమా ప్రీమియం ను జమ చేయడం జరిగిందని, వాలిడ్ దరఖాస్తులను అప్లోడ్ చేసేసి ఇన్వాలిడ్ దరఖాస్తులను వెంటనే వెనక్కు పంపితే వాటిని సరిదిద్ది తిరిగి పంపించడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా చేయూత దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులందరికీ లబ్ది చేకూర్చాలని అన్నారు. ఈ పధకం క్రింద జిల్లాలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కలిపి 71 వేల జంతువులను అందజేయాలని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. వీటిలో ఈ నెల 10 న పధకం ప్రారంభానికి కనీసం వెయ్యి మంది లబ్ది దారులను గుర్తించి యూనిట్లను గ్రౌన్దింగ్ చేయడానికి సిద్ధం చేయాలని సూచించారు.


బ్యాంకు పరిసరాలు పచ్చగా, ఆహ్లాదంగా ఉంటె కాలుష్యాన్ని నివారించవచ్చని, ప్రతి బ్యాంకు వద్ద ఖాళీ స్థలంలో మొక్కలు వేయాలని కోరారు. ఎవరెవరికి ఏమేం మొక్కలు కావాలో ఇండెంట్ పెడితే జిల్లా అటవీ శాఖ నుండి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్.బి.ఐ ట్రైనింగ్ సెంటర్ వద్ద గతంలో నాటిన మొక్కలను చక్కగా సంరక్షించి బృందావనంలా చేసారని వారిని అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు మాన్ అఫ్ ఎక్ష్లెన్సు అవార్డు వచ్చినందున బ్యాంకర్లందరూ పూల బొక్కేలతో సత్కరించారు.
ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ లు డా. ఆర్. మేష్ కుమార్, జే. వెంకట రావు, లీడ్ జిల్లా మేనేజర్ కె. శ్రీనివాస రావు, డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. సుబ్బా రావు, బి.సి. ఎస్.సి కార్పొరేషన్ల ఈ.డి లు నాగరాణి, జగన్నాధం,పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

(Visited 15 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *