ఛ‌‌త్ర‌ప‌తి రీమేక్‌లో బెల్లంకొండ‌

బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ

ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్‌

ఎస్.ఎస్.రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ నటించిన ‘చత్రపతి’ రీమేక్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. దీనికి మాస్ డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

బెల్లాంకొండ శ్రీనివాస్ తక్కువ సమయంలో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ ఆయ‌న చిత్రాల‌కు వ్యూస్ అధికంగా వ‌స్తున్నాయి. బెల్లంకొండ 2014లో సూప‌ర్‌యాక్ష‌న్ చిత్రం అల్లుడు సీను తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. త‌క్కువ స‌మ‌యంలోనే త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. బాలీవుడ్‌పై త్వ‌ర‌లోనే త‌న స‌త్తా చాట‌డానికి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం ఛ‌త్ర‌ప‌తితో రెడీ అయ్యాడు. పెన్ స్టూడియోస్ అధినేత‌ డాక్టర్ జయంతిలాల్ గడా అనేక విజయవంతమైన వాణిజ్య సంస్థల య‌జ‌మాని. ఛ‌త్ర‌ప‌తిని నిర్మించ‌డానికి ఆయ‌న ఎంతో ఉత్సాహంతో ఉన్నారు.

ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ పెన్ స్టూడియోస్ యొక్క ఎండి & ఛైర్మన్ డాక్టర్ జయంతిలాల్ గడా మాట్లాడుతూ “చత్రపతి గొప్ప స్క్రిప్ట్ , దానిని బాలీవుడ్‌లో తెర‌కెక్కించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నా..ఆ పాత్ర‌కు స‌రిగ్గా సూట‌య్యే వ్య‌క్తి బెల్లంకొండ‌.

మాస్ మరియు పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్లను రూపొందించడంలో పేరుగాంచిన డైరెక్టర్ వివి వినాయక్. టాలీవుడ్ లోని ప్ర‌ముఖ హీరోలంద‌రికీ పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు. ఫిల్్మ మేకింగ్‌లో అపార అనుభ‌వం ఉంది. రీమేక్‌ల‌కు త‌న మ్యాజిక్‌తో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. అందుకే ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌ను ఆయ‌న చేతిలో పెట్టామ‌ని జ‌యంతిలాల్ చెప్పారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీని గుర్తించిన అతని చిత్రం ‘ఖైదీ నెం 150, బాహుబలియేతర హిట్‌గా ముగిసింది. రాజమౌలి వంటి చాలా మంది అగ్ర దర్శకులు వివి వినాయక్ సినిమాల్లో హీరోయిజం ఎంత బాగా చూపిస్తారోన‌ని ప్రశంసించారు. వి.వి.వినాయక్ ‘అల్లుడు సీను’ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌లో లాంచ్ చేశాడు, ఇప్పుడు అతను బాలీవుడ్‌లో ఇత‌ని చేతులుమీదుగానే ఎంట్రీ ఇవ్వ‌డం యాధృచ్చికం.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ “బాలీవుడ్‌లో ఇది సరైన ప్రాజెక్ట్. డాక్టర్ గడా మరియు పెన్ స్టూడియోస్‌తో కలిసి పనిచేయడం, నా మొట్టమొదటి దర్శకుడు వి.వి.వినాయక్ సార్‌తో తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ చేసిన పాత్రను పోషించడం చాలా పెద్ద బాధ్యత, కానీ ఇది సరైన స్క్రిప్ట్ అయినందున నేను సంతోషంగా ఉన్నాను. ”

(Visited 10 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *