జ‌గ‌న్‌కు సీమంతం

జీవీఎంసీ 33 వ వార్డు నుంచి తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ పార్టీ ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మీద అసెంబ్లీ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద వైసీపీ మంత్రులు, కొడాలి నాని , అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్యే లు అంబటి రాంబాబు , వల్లభనేని వంశీ , ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి , చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశాఖ టీడీపీ నాయకులు గత రెండురోజులుగా చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీనికి కొనసాగింపుగా బుధవారం టీడీపీ అధికార ప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి, మహిళా నాయకురాలు విల్లూరి తిరుమల దేవి చక్రవర్తి ఆధ్వర్యంలో మరింత వినూత్నంగా జగన్ వేషధారునికి సీమంతం నిర్వహించారు. మహిళా కార్యకర్తలు, నాయకామణులు ఉత్సాహంగా సీమంతం, పేరంటం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విల్లూరి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ జగన్ అసమర్ధ పాలనతో, విలువల్లేని రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మహోన్నత వ్యక్తి ఎన్ఠీఆర్ కుమార్తెగా క్రమశిక్షణ తో పెరిగి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని భువనేశ్వరి పై అవాకులు చెవాకులు పేలిన దుష్టులు త్వరలోనే ఫలితం అనుభవిస్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాక ప్రజల ద్రుష్టి మరల్చేందుకు భజనపరులతో చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని విమర్శించారు. మాటతప్పడం, మడమతిప్పడమే జగన్ కి తెలిసిన విద్య అన్నారు. చేతకాని పాలనతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ ఏమాత్రం మానవతా విలువల్లేకుండా మహిళలపై కువిమర్శలకు నిరసనగా జగన్ మరియు ఆయన భజనపరులను ఆడంగులుగా వినూత్న సీమంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా జగన్ బుద్ది తెచ్చుకుని చంద్రబాబు కుటుంబాన్ని క్షమాపణ కోరాలని దుష్ట మంత్రిలను వెంటనే బర్తరఫ్ చెయ్యాలని చక్రవర్తి డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో జాగరపు చిన్న , కోనేటి సురేష్ , ఎల్లపు శ్రీను, సురేంద్ర, ఈరోతి చిన్న కుమార్ , యు పైడ్రాజు ఈ వినూత్న సీమంత కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

(Visited 302 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.