బ‌డ్జెట్ అద్భుతం

చింతపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఒకరోజు సమావేశాల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ అన్ని రంగాల వారికి మేలు జరిగే విధంగా ఉందని పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి అన్నారు. గురువారం స్థానిక విలేకరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి. నాడు నేడు లో భాగంగా విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తూ భారీ కేటాయింపులు చేయడం శుభపరిణామమన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన విద్య వైద్యం ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నరని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నారులకు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు శిశు సంక్షేమ శాఖ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె కొనియాడారు. మహిళా సాధికారత దిశగా పెట్టిన ఈ బడ్జెట్ బిల్లు మరోసారి ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అనడంలో సందేహం లేదని అన్నారు. గత ఏడాది 27.34% కేటాయింపులు చేశారని ఈ ఏడాది తెగల ఉప ప్రణాళికకు గాను రూ. 6,131 కోట్ల 24 లక్షల కేటాయింపులు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నమన్నారు.

(Visited 87 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *