ప్ర‌చార హోరు

అన‌కాప‌ల్లి:రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో 80వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ త‌రుఫున పోటీ చేస్తున్నకొణ‌తాల నీలిమాభాస్క‌ర్‌ను అత్య‌ధిక మెజార్టీతో గెలిపించాల‌ని వైఎస్సార్‌సీపీ నాయ‌కుడు కేఎం నాయుడు మిత్ర బృందం ఆధ్వ‌ర్యంలో విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించారు. స‌త్త‌మ్మ‌త‌ల్లి గుడి నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా భాస్కర్ మాట్లాడుతూ ప్రజల ఆధరాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ప్రతిచోటా ఘనస్వాగతాలు పలుకుతున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని అన్నారు. నా భార్య నీలిమని 80వ వార్డ్ నుంచి వైస్సార్సీపీ కార్పొరేటర్గా బారీ మెజారిటీతో గెలిపించమని కోరుతున్నాన‌న్నారు. మౌలిక సదుపాయాలు అందేలా చేస్తామని ఎవరికి ఏ కష్టం లేకుండా ప్రభుత్వ పథకాలలో జాప్యం జరగకుండా చూసుకుంటామని మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. బురద జల్లే రాజకీయాలను గత ఎన్నికలలో ఎలాగైతే తిప్పికొట్టారో అంతకుమించి ఈ జీవీఎంసీ ఎన్నికలలో తిప్పికొట్టాలని కోరారు. మన ప్రభుత్వం వచ్చిన ఈ 22 నెలలలోనే జగనన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని మున్ముందు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే దిశగా జగనన్న ప్రభుత్వం వ్యూహ రచన చేస్తుందన్నారు. కార్పొరేట‌ర్ అభ్య‌ర్థుల‌ను అత్యధిక మెజారిటీతో గెలిస్తే అవన్నీ మనకి అందడానికి మార్గం సుగమం అవుతుంద‌న్నారు. ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నా భార్య నీలిమని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు పీలా శ్రీనివాసరావు, కాండ్రేగుల శ్రీరామ్,కోరుబిల్లి ఆరుద్ర, కోరుబిల్లి పరి,కర్రి అప్పాజీ,మద్దాల శివనాయుడు, పెంటకోట అప్పలనాయుడు, పెంటకోట రాజా, పెంటకోట సాగర్, కాండ్రేగుల కిషోర్,పొలిమేర మణి,దాడి త్రినాధ్, కాండ్రేగుల రాము, పెంటకోట సన్యాసినాయుడు, మద్దాల సురేష్, కొణతాల మహాలక్ష్మి ప్రసాద్, బుద్ద రమణాజీ,వేగి త్రినాధ్,కర్రి రుద్రి, వాసుపల్లి తాతీలు, చదరం పరమేశ్వరరావు,విల్లూరి శేఖర్, విల్లూరి సంతోష్, కొణతాల చందు,పెంటకోట సునీల్, ఆళ్ళ చంటి మరియు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

(Visited 33 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *