కొండ కొప్పాకలో చిన్నతల్లి కి అపూర్వ స్పందన


అనకాపల్లి: తెలుగు దేశం పార్టీ 84వ కార్పోరేటర్ అభ్యర్థిని మాదంశెట్టి చిన్న తల్లికి కొండ కొప్పాక గ్రామంలో అపూర్వ స్పందన లభించింది. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొప్పాక గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా దుర్గా దేవి అమ్మవారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అభ్యర్థి చిన్నతల్లి దృష్టికి తీసుకురాగా గెలిచిన వెంటనే మీ న్యాయమేనా డిమాండ్లను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్న తల్లి సమక్షంలో స్థానికులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎం గోపాలరావు, వానపల్లి బాబురావు, బోయిన మురళీమోహన్ , గిరి కుమార్, బిశెట్టి గంగరాజు, ఎం నాగేశ్వరరావు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

(Visited 239 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *