చిత్ర నిర్మాణాలకు విశాఖ నగరం ఓ ప్రత్యేక కేంద్రం

ఎస్ ఎఫ్ ఎక్స్ 5వవార్షిక వేడుకల్లో నగర మేయర్

విశాఖపట్నం : చిత్ర నిర్మాణాలకు విశాఖ నగరం ఓ ప్రత్యేక కేంద్రమని, విశాఖ నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి అన్నారు. ఆదివారం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ఎస్ ఎఫ్ ఎక్స్ 5వవార్షిక వేడుకలకు ఆమె గౌరవ అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విశాఖ నగరాన్ని సినీ హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. విశాఖలో కళాకారులకు కొదవలేని నగరంగా పేరు ప్రఖ్యాతులు సంతరించుకుంటుందని తెలిపారు. ఎస్ ఎఫ్ ఎక్స్ ఫిల్మ్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ పి. శ్యామ్ కుమార్ అతి తక్కువ కాలంలో 25 సినిమాలు, 100 లఘు చిత్రాలుకు విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, రికార్డింగ్ వంటివి తన ఫిల్మ్ స్టూడియో ద్వారా చిత్రాలకు అందించడం ఎంతో అభినందనీమని కొనియాడారు. అనంతరం 25 కేజీల కేక్ ను కట్ చేసి శ్యామ్ కుమార్ కు తినిపించి అభినందనలను తెలిపారు.
ఎస్ ఎఫ్ ఎక్స్ ఫిల్మ్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ పి. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ నా తల్లిదండ్రులైన ప్రసాద్, సత్యవతి ప్రోత్సాహం,వారి ఆశీస్సులతో స్టూడియో ప్రారంభించి నేను గడచిన ఐదు సంవత్సరాల్లోనే 25 సినిమాలు చేయడం జరిగిందని అన్నారు.

అనంతరం మేయర్ దంపతులను దుశ్శాలువ ఘనంగా ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ అతి చిన్న వయస్సు లోనే శ్యామ్ కుమార్ స్టూడియో ను ప్రారంభించి 5 సంవత్సరాల్లో ఉన్నతమైన సాంకేతిక విలువలతో కూడిన సినిమాలు చేయడం గొప్ప విషయమని, రానున్న కాలంలో ఇంకా మంచి మంచి చిత్రాల్ని తన ఎస్ ఎఫ్ ఎక్స్ స్టూడియో ద్వారా అందించాలని ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోని విశాఖ కీర్తి ప్రతిష్టలను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్అసోసియేషన్ (ఏపీ మా) వ్యవస్థాపక అధ్యక్షులు ఏ. ఎం. ప్రసాద్, సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి, నటుడు ప్రసన్న కుమార్, ఏపీ మా అధ్యక్షులు కృష్ణకిషోర్, దర్శకులు దివాకర్, అనుబంధం చారిటబుల్ ట్రస్ట్ అధినేత శంకర్రావు, లీగల్ అడ్వైజర్ విశ్వనాధ్ రావు, సీనియర్ నటులు నాంచారయ్య, శివజ్యోతి, ఏపీ మా కార్య నిర్వాహక కార్యదర్శులు రమేష్ యాదవ్, పూతి వెంకటరెడ్డి, నిర్మల్ భాను, వైస్ ప్రెసిడెంట్ రవితేజ, సీనియర్ సినీ జర్నలిస్ట్ నవీన్ పట్నాయక్, విశాఖ పొట్టి మూర్తి, ఫిల్మ్ ఫెడరేషన్ కార్యదర్శి సన్యాసిరావు ఉపాధ్యక్షులు కళ్యాణ్, నగరంలో ఉన్న వివిధ కళా సంఘాల ప్రతినిధులు పాల్గొనగా ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ కళాకారుడు బొట్ట నాగేశ్వరరావు మాట్లాడే బొమ్మతో చేసిన కార్యక్రమం సాయినాధ్ కళాసమితి సాయి పట్నాయక్ చేసిన శివతాండవం అహుతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

(Visited 5 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *