మెరుగుపడిన పారిశుధ్యం సుదీర్గ కాలం గా పేరుకుపోయిన చెత్తను తొలగించిన సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు
అనకాపల్లి :
ఛీ.. చెత్త.. కంపు…కంపు… అంటూ తుమ్మ గ్రామం వైపు కన్నెత్తి చూడని వారు ఇప్పుడు ఆహ సభ అంటూ సర్పంచ్ పెంటయ్య నాయుడు పై ప్రశంసలతో ఎత్తేస్తున్నారు.సుదీర్ఘ కాలం
గా గ్రామంలో చెత్త పేరుకు పోవడంతో ఇటుగా వెళ్లే వాహన చోదకులు, స్థానికులు కంపు భరించ లేక ఇటుగా వెళ్లడానికి సహనం లేదు. కానీ అనకాపల్లి వెళ్లాలి అంటే ఈ చెత్తను దాటే వెళ్లాలి. తుమ్మపాల – చోడవరం ప్రధాన రహదారి ఆనుకుని రెండు చోట్ల గ్రామంలో చెత్తను డంపింగ్ యార్డ్ గా ఉపయోగిస్తున్నారు. అయితే గ్రామ సర్పంచిగా గెలుపొందిన తట్ట పెంటయ్య నాయుడు ఇక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు చేసిన ప్రయత్నాలకు డిపిఒ శిరీషా రాణి సహకారంతో గత రెండు రోజులుగా చెత్తను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. గత దశాబ్ద కాలంగా చెత్తను వెయ్యడం వలన కొండల పేరుకు పోయింది. పంచాయతిలో నిధుల సమస్య కారణంగా చెత్తను తొలగించే పనిని చేపట్టలేకపోయారు.దీనికి తోడు గ్రామంలో డంపింగ్ యార్డు లేకపోవడంతో ప్రజలు ఇక్కడే చెత్త పోగు పడుతున్నారు.దీంతో చెత్త కొండల పేరుకు పోయింది.గ్రామంలో ప్రధాన సమస్యగా తయారైంది. దీంతో అనకాపల్లి డిపిఒ శిరీషా రాణి సహకార సర్పంచ్ కోరడంతో ఆమె స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.దీంతో గురువారం కూడ చెత్తను తొలగించారు. ఈ ప్రాంతాన్ని అద్దం లా తయారు చేసారు. చెత్త రహిత ప్రదేశం గా చూడాలన్న కోరిక నెరవేరుతుందని సర్పంచ్ పెంటయ్య నాయుడు తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల పరిషత్ ఇఒఆర్డి ధర్మారావు,తుమ్మపాల ఇఒ శ్రీనివాసరావు, బవులువాడ కార్యదర్శి త్రిన్నాధ్,మార్టూరు కార్యదర్శి వలివెల ఈశ్వరరావు, కూండ్రం గ్రామ కార్యదర్శి చింతల శ్రీనివాసరావు పంచాయతి సభ్యులుగా ఉన్నారు.