విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన బవులువాడ సచివాలయ కార్యదర్శి ని సస్పెండ్ చెయ్యాలి. జిల్లా పంచాయతి అధికారికి పిర్యాదు చేసిన వార్డు సభ్యులు.
అనకాపల్లి :
బవులువాడ గ్రామ సచివాలయ త్రిన్నాద్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్థులు జిల్లా పంచాయతి అధికారికి పిర్యాదు చేసారు.అక్టోబర్ 2 న నిర్వహించారువలసిన గ్రామ సభను నిర్వహించలేదని అలాగే గడపగడపకు మన ప్రభుత్వం జిల్లా గురించి ఎవరికి సమాచారం ఇవ్వలేదని పంచాయతి అధికారికి ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు. గ్రామ సమస్యలపై కనీసం పట్టించుకోవడం లేదని తక్షణమే బవులువాడ సచివాలయ కార్యదర్శి పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్.వార్డు సభ్యులను కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు.సమయంలో గ్రామ సభ నిర్వహించకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శి త్రినాధ్ ని సస్పెండ్ చెయ్యాలని వార్డు సభ్యులు డిమాండ్ చేసారు.ఇటీవల బవులు గ్రామంలో కట్టని ఇళ్లకు ఇంటి పన్ను ఆరోపణలు వినిపిస్తున్నాయి.సుమారుగా వంద ఇంటి పన్నులు వేసినట్లు గ్రామంలో చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.