టమాటా రైతులను ఆదుకోవాలి : అనకాపల్లి వ్యవసాయ దారుల సంఘం ఉపాధ్యక్షులు విల్లూరి పైడారావు.
అనకాపల్లి :
అనకాపల్లి ఆవఖడం లో కురిసిన వర్షాలు వల్ల మున్సిపల్
డ్రైనేజీ కాలువల ద్వారా వచ్చిన వర్షం నీరు నేరుగా ఆవఖండం లో ప్రవేశించి ఉద్యాన పంటలకు పూర్తి నష్టం వాటిల్లిందని అనకాప
ల్లి వ్యవసాయ దారుల సంఘం ఉపాధ్యక్షులు విల్లూరి పైడారావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆవఖండంలో సుమారు 300 ఎకరాలలో రైతులు టమోటా సాగు వేసారని అన్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి రైతు టమోటా పంట వేస్తే అకాల వర్షాల వలన మున్సిపల్ డ్రైనేజీ వాటర్ ఆవఖండంలో కి రావడంతో టమాటా పంట పూర్తిగా నీటి పాలు అయ్యిందని ఆయన అన్నారు. దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారని నష్టం విలువ సుమారు కోటీ యాభై లక్షల వరకు ఉంటుందని పైడారావు అన్నారు.
ఈ విషయాన్ని ఆయన ఉద్యానవన అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో అధికారులు శుక్రవారం నీట మునిగిన టమాటా పంటను పరిశీలించారు. ఆవఖండంలో నీట మునిగిన పంటను పరిశీలించిన వారిలో జిల్లా ఉద్యానవన అధికారి ప్రభాకర్ ఉద్యానవన శాఖ ఏవో లావణ్య లు పరిశీలించారు. అనంతరం పంట నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని వారు తెలిపారు. న
టమాటా పండించేరైతులలో ఎక్కువమంది పారకారీ రైతులే ఉన్నారని వారికి న్యాయం జరిగే విధంగా నివేదిక తయారు చేయాలని అధికారులను పైడారావు కోరారు
ఈ కార్యక్రమములో మండల వ్యవసాయ అధికారి రంగాచారి విస్తరణాధికారులు గణేషు శ్రీను రైతులు కర్రి మోది నాయుడు పరదేశి నాయుడు కొణతాల శ్యాము కర్రి నూకరాజు కొలతల ఉమామహేశ్వరరావు పొలిమేర శ్రీను అధిక సంఖ్యలో రైతులు పాల్గొని పంట పొలాలను పరిశీలన చేశారు.