సగానికి విరిగిబడిన కల్వర్టు : భయబ్రాంతులతో దేవినగర్ ప్రజలు

అనకాపల్లి :

 

నేతలు మారిన ఈ కల్వర్టు రాత మాత్రం మారలేదు .
మంత్రి గుడివాడ అమర్నాథ్,ఎంపి డాక్టర్ బి.వి సత్యవతి లైన సుదీర్ఘ సమస్యకు పరిష్కారం చూపుతారని ఎదురు చూస్తున్న దేవినగర్ వాసులు
కొత్తూరు దేవినగర్ లో దొంగ గెడ్డ పై వున్న కల్వర్టు ఎప్పటినుండో శిధిలావస్థలో వుంది.నేడు కురుస్తున్న వర్షాలకు సగానికి వూడి తెగిపడినట్టు గెడ్డలో పడిపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.అయితే ఈ దొంగ గెడ్డ పరిస్థితి కల్వర్టు దుస్థితి మారుస్తామని ఎందరో నేతలు చాల కాలం నుండి మాటలు చెప్పారు.. తూ తూ మత్రంపు పనులు చేశారు.అయితే నేతలు మారినా ఈ ప్రాంత ప్రధాన సమస్య కు రాత మారలేదు.పరిష్కారం అవ్వలేదు.కానీ నేడు పడిన వర్షాలకు పడిపోవడం సుమారు 200 కుటుంబాల వారిని భయం భారిన పడవేసింది. అధికారులు,ప్రజా ప్రతినిధులు రావడం ఏమి చేయాలని ప్రణాళికలు చేయడం ఇక్కడ వారికి ఆశలు కల్పించడం షరామామూలే. ఇక్కడ వారంతా నూతన ప్రభుత్వ నేతలైన మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతి ల రాకకై ఎదురు చూస్తున్నారు. వారైనా నాటి సమస్యకు నేటికైన పరిష్కారం చూపుతారని ఆశతో ఎదురు చూస్తున్నారు.

(Visited 109 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.