అనకాపల్లి జిల్లాలో కూడా డిప్యుటేషన్లు రద్దు

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ పరిధిలో డిప్యుటేషన్లు అన్నింటినీ రద్దు చేస్తూ ఉద్యోగులు వారి ఒరిజినల్ పోస్టింగ్ లో చేరాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. 24 మండలాలతో అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లు తో ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు కేటాయించిన కొందరు ఉద్యోగులు డిప్యుటేషన్లు పై ఇతర జిల్లాలో పనిచెయ్యడం వలన సిబ్బంది కొరత ఏర్పడి ప్రజల పనులు తీవ్ర జాప్యం జరుగుతుంది.ఇలాంటి సమస్య అన్ని జిల్లాలో నెలకొనడంతో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పునర్విభజన కు ముందున్న జిల్లా కలెక్టర్లు వివిధ విభాగాల జిల్లా అధికారులు కొత్త జిల్లాలో ఉద్యోగుల సర్వీసుకు సంబంధం కల లీన్, సీనియారిటి,పదోన్నతులు తదితర అంశాలను పర్యవేక్షించే నోడల్ అధికారులు గా వ్యవహరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం జిఒ నెంబరు 24 లో పేర్కొంది.

(Visited 179 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *