విశాఖ కు దీటుగా అనకాపల్లి అభివృద్ధి


విశాఖకు ధీటుగా అభివృద్ధి చేయాలన్నదే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారని జీవీఎంసీ అనకాపల్లి 82 వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత అన్నారు. అనకాపల్లి నెహ్రూచౌక్ కూడలి లో బుధవారం ఆమె హైమాస్ట్ విద్యుద్దీపాలను ప్రారంభించారు. …ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశలవారీగా అనకాపల్లిలోని అన్ని ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కృషి చేస్తున్నారన్నారు. అలాగే అనకాపల్లి పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఆయన చర్యలు చేపట్టారన్నారు. అందులో భాగంగా పట్టణం లో కాలువల నిర్మాణం, పట్టణంగా ప్రవహిస్తున్న ప్రధాన పంటకాలంలో వ్యర్ధాలు తొలగింపు చర్యలు చేపట్టారన్నారు. వైకాపా పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి *జానకిరామరాజు మాట్లాడుతూ కొవిడ్ నిబంధనల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిఇంచామన్నారు. తొలివిడతగా అనకాపల్లి పట్టణ ప్రధాన నెహ్రుచౌక్ కూడలి, విజయరామరాజుపేట, నర్సింగ రావు పేట, డిడి నాయుడు ఆస్పత్రి కూడళ్ళలో హై మాస్టర్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ పాత్రిని శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ పట్టణంలో నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. కోవేట్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. భాస్కరరావు, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు, సూపర్వైజర్ పందిరి మురళి, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

(Visited 291 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *