ఢీ చాంపియన్‌ పీయూష్‌

ట్రోఫీ తోపాటు రూ75లక్షల ప్రైజ్‌ మనీ

ఢీ చాంపియన్స్‌ ఫైనల్‌ సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన డ్యాన్స్‌ పోటీఉత్కంఠభరితంగా సాగింది. చివరకు పీయూష్‌ విన్నర్‌గా నిలిచాడు. పీయూష్‌..సోమేష్‌ కడవరకూఅద్భుతంగా పోటిపడ్డారు. విన్నర్‌ పీయూష్‌కు ట్రోఫీని కొరియాగ్రాఫర్‌, ఢీ చాంపియన్స్‌ న్యాయనిర్దేత శేఖర్‌మాస్టర్‌ అందజేశాడు. రూ.75 లక్షల (ప్రైజ్‌ కూడా అందుకున్నారు. పీయూష్‌కు ద్యాన్స్‌ మాస్టర్‌గాయశ్శంత్‌ మాస్టర్‌ వ్యవహరించగా… రన్నర్‌గా నిలిచిన సోమేష్‌కు చిట్టీ మాస్టర్‌ శిక్షణ ఇచ్చాడు. ఫైనల్‌లోన్యాయనిర్దేతలు కొన్ని టాస్క్‌లు పెట్టారు. మెగాస్టార్‌ ఫ్యామిలీ హీరోల చిత్రాలలో పాటలకు కొరియోగ్రఫీచేయాలని చెప్పగా..పీయూష్‌, సోమేష్‌లిద్దరూ వారి పాటలను అదిరిపోయే స్టెప్‌లేశారు. సాహసాలతో కూడిన డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌లతో బుధవారం ఈటీవీ టాప్‌ రేటింగ్‌లో దూసుకుపోయింది. పీయూష్‌కు టీం
లీడర్లగా సుడిగాలి సుధీర్‌, రేష్మీ వ్యవహరించారు. న్యాయనిర్దేతలుగా శేఖర్‌ మాస్టర్‌తోపాటు ప్రియమణి, పూర్ణ వ్యవహరిం చారు. వచ్చే బుధవారం మరో కొత్త డ్యాన్స్‌ సిరీస్‌తో మీ ముందుకు వస్తామని యాంకర్‌ ప్రదీప్‌ ప్రకటించాడు.

(Visited 1 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *