క్రమశిక్షణ పట్టుదల విజయానికి సోపానాలు

విజ‌య‌న‌గ‌రం: క్రమశిక్షణ పట్టుదల విజయానికి సోపానాలు అని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లలిత అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన క్విజ్‌పోటీల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సమయ నిర్వహణ(టైమ్‌ మేనేజ్‌మెంట్‌)తో ప్రణాళికాబద్ధంగా చదివే ప్రతీ విద్యార్ధి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. ఈ సందర్భంగా సమకాలీన అంశాలు, క్రీడలుపై జరిగిన క్విజ్‌ పోటీలలో విజేతలకు ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు లేళ్ల వెంకటేశ్వరరావు, సముద్రాల గురుప్రసాద్‌లతో కలసి లలిత బహుమతులను అందచేసారు.ఈ కార్యక్రమంలో ఉపగ్రంథాలయ అధికారి గోపాలరావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

(Visited 81 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *