విధుల్లో అల‌స‌త్వం వ‌ద్దు

క‌లెక్ట‌ర్ విన‌య్‌చంద్‌

విశాఖపట్నం : గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలపై సచివాలయ సిబ్బంది పూర్తి అవగాహన కలిగి వుండాలని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు. సచివాలయాలలో వివిధ సంక్షేమ పథకాల జాబితాలను అప్ టు డేట్ చేసి సచివాలయంలో ప్రదర్శించాలన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరు పద్మనాభం మండలంలో మద్ది గ్రామంలో సెక్రటేరియట్ ను, పేదలకు ఇళ్ల పట్టాల కోసం ప్రతిపాదిత లే అవుట్ ను పరిశీలించారు. తదుపరి గంధవరం గ్రామంలో సచివాలయాన్నిఆయన సందర్శించి అక్కడే నిర్మాణంలో వున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణపు పనులను పరిశీలించారు.

మద్ది సచివాలయాన్ని సందర్శించిన కలెక్టరు లబ్దిదారుల జాబితాలను పరిశీలించారు. అవి అప్ టూ డేట్ గా ఉండక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందిని వారి విధుల గురించి ప్రశ్నించారు. నెట్ వర్క్ ఆసుపత్రుల క్యాలండర్, గ్రామ సచివాలయాల ద్వారా అందజేయు సేవల జాబితాలను ప్రదర్శించకపోవడంపై సిబ్బందని ప్రశ్నించారు. ఆరోగ్య మిత్ర, ఇంజనీరింగు అసిస్టెంట్, పంచాయితీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, పోలీస్ అసిస్టెంట్, తదితర సిబ్బందిని వారి విధి నిర్వహణ గురించి ప్రశ్నించారు. సిబ్బంది సమాధానాలపై కలక్జరు అసంతృప్తి వ్యక్తం చేశారు. మపాళా పోలీస్ కు శిక్షణ ఇవ్వాలని సూచించారు. హెల్త్ అసిస్టెంటుకు మెమో ఇవ్వాలని యం.పి.డి.ఒ.ను ఆదేశించారు.
తదుపరి కలెక్టరు మద్ది గ్రామంలో ప్రతిపాదిత లే అవుట్ ను పరిశీలించారు. 3.41 ఎకరాలలో 136 మంది లబ్దిదారులకు పట్టాలను అందించడానికి గాను ఏర్పాటు చేస్తున్న లే అవుట్ ను కలెక్టరు పరిశీలించారు. లే అవుట్ వివరాలను గృహనిర్మాణ శాఖ డి.ఇ. హెచ్ ఎస్.జి. రంగనాథ్ కలెక్టరుకు వివరించారు.
తరువాత కలెక్టరు గంధవరం గ్రామంలో నిర్మాణంలో వున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రము వెల్ నెస్ సెంటర్లను పరిశీలించారు. ఎస్.ఇ.పి.ఆర్. నిర్మాణపు పనుల పురోగతిని కలెక్టరుకు వివరించారు. పనులలో జాప్యము లేకుండా నిర్మాణాలు సకాలంలో పూర్తి గావించాలని కలెక్టరు ఇంజనీర్లను ఆదేశించారు.

తదుపరి కలెక్టరు పద్మనాభం మండలం గంధవరం గ్రామ సచివాలయంను పరిశీలించి రైస్ కార్డులు, చేయూత, తదితర పథకాల లబ్దిదారుల జాబితాలను పరిశీలించారు. అవి సక్రమంగా ఉండక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులలో జాబితాలను అప్ టు డేట్ గావించాలన్నారు. పాస్ పుస్తకాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా ఇబ్బందులు పెడుతున్నారా అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి సచివాలయ సేవలపై కర పత్రాలు అందించాలన్నారు.

(Visited 12 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *