యూజ‌ర్ చార్జీలు పెంచితే ఊరుకోం

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ


అన‌కాప‌ల్లి : వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ పేరుతో యూజ‌ర్ చార్జీల భారం ప్ర‌జ‌ల‌పై మోప‌ద్ద‌ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి పీలా గోవింద స‌త్య‌నారాయ‌ణ ప్ర‌భుత్వాన్ని కోరారు. పేద,మధ్య తరగతి ప్రజలపై చార్జీల పేరుతో” వైకాపా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని”ఆరోపించారు. పట్టణంలో ఫ్లాట్ల యజమానులు ,చిన్న దుకాణాలు,షాపింగ్ మాల్స్, హోటళ్లు ,కళ్యాణ మండపాలు జీవీఎంసీకి ఆస్తిపన్నును చెల్లిస్తున్నప్పుడు మరలా ఘన వ్యర్దాల నిర్వహణ నెపంతో “యూజర్ చార్జీలను పెంచవలసిన అవసరం ఏముంధని ఆయన ప్రశ్నించారు. సోమ‌వారం గ‌వ‌ర‌పాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

కొత్తగా సంస్కరణల పేరుతో యూజర్ చార్జీలను వసూలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్థుంద‌ని తెలిపారు. సంక్షేమ పథకాల పేరుతో ఇస్తూనే మరొక పక్క పన్నుల పేరుతో” ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పీల్చి పిప్పుచేస్తున్నారని” అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పుడు నుండి “రాష్ట్రంలో సామాన్య ప్రజలు బ‌తకలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కరోనా సృస్టించిన లాక్డౌన్ వలన గడిచిన 8 నెలలుగా వ్యాపారస్తులందరు వ్యాపారాలు లేక షాపుల అద్దెలు ,సిబ్బందికి జీతాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో వ్యర్దాల నిర్వహణ పేరుతో వారిపై భారం మోపడం సరికాదు అని తెలిపారు. వెంటనే జి‌వి‌ఎం‌సి వారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్” చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ,పార్టీ నాయకులు బీఎస్ ఎంకే జోగి నాయుడు, బొద్దపు ప్రసాద్, శ్రీకాకుళపు గణపతి తదితరులు పాల్గొన్నారు.

(Visited 33 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *