ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దు


అన‌కాప‌ల్లి :ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫెడరేషన్ బ్యాంకు యూనియన్స్ ఆదేశాల మేరకు సోమవారం స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (eఆంధ్రా బ్యాంక్) ఉడ్ పేట శాఖ దగ్గర బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా బ్యాంక్ యూనియన్ నాయకులు కాండ్రేగుల హరికృష్ణ మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయడం లాభాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక ప్రభుత్వ రంగ విధానాలను నిరసిస్తూ బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న సుమారు పది లక్షల మంది ఉద్యోగులు అధికారులు తీవ్ర నిరసన పడుతున్నారని ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలించ కపోతే మార్చి 15 16 తేదీలలో దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తామని బ్యాంకు ఉద్యోగులు హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పండూరు గోవిందరావు ,వి వి ఆర్ కృష్ణ, బ్రాంచ్ మేనేజర్ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ చంద్రశేఖర్, రమ్య సాయి, మోహిని కుమారి, తోట శ్రీనివాసరావు, రామలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు

(Visited 89 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *