మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు

విశాఖపట్నం : మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని విశాఖ నార్త్ ట్రాఫిక్ సీఐ టి. వి. విజయ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం మధురవాడ చంద్రపాలెం హైస్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మైనర్లకు సాధారణంగా డ్రైవింగ్ పై అవగాహన ఉండదన్నారు. సరదా కోసం వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. మైనర్లకు యజమానులు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. ట్రాఫిక్‌ నియమ నిబంధనలు విద్యార్థి దశ నుంచే తెలుసుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్పారు. విద్యార్థులు రోడ్డుపై జరిగే ప్రమాదాలను తల్లిదండ్రులకు, చుట్టు పక్కల వారికి వివరించి, వారిలో చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మురళీకృష్ణ పాల్గొన్నారు.

(Visited 7 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *