ఇంటింటి ప్ర‌చారంలో మాదంశెట్టి చిన‌తల్లి

జీవీఎంసీ ఎన్నికల్లో 84 వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాదంశెట్టి చిన్న తల్లి , పార్టీ నాయకులతో మహిళా సంఘ సభ్యులతో ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం రఘురామ్ కాలనీలో ప్రచారాన్ని ప్రారంభించిన కాలనీ వాసులతో మాట్లాడుతూ 2014 సంవత్సరం నుండి రఘు రామ్ కాలనీ లేఔట్ మెయిన్ రోడ్ నుండి కాలనీ కి వెళ్లే రహదారి సమస్య దీర్ఘకాలం గా ప్రధాన సమస్యగా కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ కోర్టు హైకోర్టు వివాదాలతో గత ఆరు సంవత్సరాల నుండి అనేక ప్రయాసలు అనుభవిస్తున్నారని ఎట్టకేలకు హైకోర్టు కూడా రోడ్డు హక్కు లేఅవుట్ యాజమాన్యానికి ఉందని ఆదేశాలు ఇచ్చినప్పటికీ జీవీఎంసీ అధికారులు రోడ్డు నిర్మాణం చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఈ ప్రధాన సమస్యను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి నట్లయితే సిమెంటు రోడ్ల నిర్మాణం పార్కు ని అభివృద్ధి చేసి కాలనీ ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తామని హామీ ఇస్తామని ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో మాదంశెట్టి చిన్న తల్లి నీల బాబుఓటర్లు కు హామీ ఇస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొణతాల రత్నకుమారి దాసు ముప్పని గిరిజ దాసరి వెంకట రత్నం శ్రీకాకుళం గణపతి సాలాపు సూర్యనారాయణ కాలనీవాసులు పాల్గొన్నారు

(Visited 54 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *