ఇంటింటా ప్ర‌చారం

అన‌కాప‌ల్లి : జివిఎంసి ఎన్నికల్లో భాగంగా 84 వార్డ్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని శుక్రవారం ఇంటింటి ప్రచారం చేసారు. స్థానిక నెయ్యిల వీధిలో చేపట్టిన ఇంటింట ప్రచారంలో అనూహ్య స్పందన వ‌చ్చింద‌ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ని మాదంశెట్టి చిన తల్లి అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడం గత ప్రభుత్వం లో నిరుపేదలకు ఇచ్చిన టిట్కో ఇల్లులు రద్దు చెయ్యడం తో ప్రజలు తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నారని అన్నారు. ఈ ప్రచారంలో స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదంశెట్టి నీలబాబు,బొలిశెట్టి శ్రీను,మహిశా నాయకురాలు కొణతాల రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

(Visited 96 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *