రేపు కోవిడ్ వ్యాక్సినేషన్ పై డ్రై రన్: కలెక్టర్


విశాఖపట్నం : కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ వ్యాక్సినేషన్ సన్నద్దత పై పరిశీలనకు సోమవారం డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. శనివారం నాడు నగరంలోని ప్రభుత్వ ఈ ఎన్ టి ఆసుపత్రిలో డ్రై రన్ ఏర్పాట్లను తనిఖీ చేసి, పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో నగరంలోని ఈ ఎన్ టి ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులలో ప్రథమ ఆసుపత్రిలో , సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో ఈరోజు డ్రై రన్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ డ్రై రన్ ను వ్యాక్సినేషన్ ప్రొటోకాల్ ప్రకారం వ్యాక్సిన్ అందుబాటులోనికి వచ్చిన తరువాత ఏ విధంగా వేయాలనే సన్నద్దత కోసమే చేస్తున్నామని అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లలైన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పని చేసే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మినిస్టీరియల్ సిబ్బంది కి టీకా వేస్తారని అన్నారు. రెండవ దశలో ఫ్ర౦ట్ లైన్ వర్కర్లు అయిన పోలీసు, రెవెన్యూ, , మున్సిపల్, పారిశుధ్య సిబ్బంది కి టీకా ఇస్తారని అన్నారు. మూడవ దశలో 50 సంవత్సరాలు పై బడిన వ్యక్తులు మరియు 50 సంవత్సరం లోబడి కో మార్బిడిటిస్ పరిస్ధితులు (రక్తపోటు, మధుమేహం , ఇతర వ్యాధులు) ఉన్నవారికి వేస్తారని తెలిపారు.

జిల్లాలో మొదటి దశలో 34,761 మంది హైల్త్ కేర్ వర్కర్లు కు టికా వేస్తారని తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన కోవిన్ సాప్ట్ వేర్ లో గుర్తింపు కార్డుల ఆధారంగా వీరి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు . వీరికి నిర్దారిత టైమ్ స్లాట్ లలో రావాలని వారి ఫోన్ కు ఎస్ ఎం ఎస్ పంపుతారని, ఆ ప్రకారం వ్యాక్సిన్ వేయించు కోవాల్సిన కేంద్రానికి (సెషన్ సైట్ ) రావాలని తెలిపారు.


ఆ కేంద్రం వద్ద బయట ఎన్ సి సి , ఎన్ ఎస్ ఎస్ , ఇతర వాలంటీర్లు వారి గుర్తింపు కార్డులను పరిశీలించి కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ వెయిటింగ్ రూమ్ లో కూర్చో పెడతారు. తరువాత వ్యాక్సినేషన్ రూం లో కోవిన్ సాప్ట్ వేర్ లో వివరాలను మరో సారి తనిఖీ చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను నమోదు చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తికి ఆటో డిస్పోజబుల్ సిరంజీతో భుజానికి టీకా వేస్తారు. అనంతరం ప్రక్కనే ఉన్న అబ్జర్వేషన్ రూం లో అరగంట సేపు పరిశీలనలో ఉంచుతారు. కొంత మంది వ్యక్తులకు టీకా వేసుకున్న తరువాత అనారోగ్య పరిస్దితులు తలెత్తే అవకాశం ఉంటుందని , ఎవరికైనా అలా జరిగితే తక్షణం అంబులెన్స్ లో సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో అడ్వాన్సు ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ ( ఏ ఈ ఎఫ్ ఐ) కమిటిని 5 మంది స్పెషలిస్టు డాక్టర్లతో లతో నియమించి ఇలాంటి పరిస్థితులను పర్యవేక్షిస్తారని తెలిపారు. టీకా వేయడానికి ఉపయోగించిన సిరంజీలను ప్రత్యేక శ్రద్దతో జాగ్రత్తగా డిస్పోజ్ చేస్తారని తెలిపారు. 104 కాల్ సెంటర్, కేంద్రప్రభుత్వ 1075 టోల్ ఫ్రీ నెంబర్లు ద్వారా సమాచారం నిరంతరం మోనిటరింగ్ చేస్తారని తెలిపారు.

విశాఖపట్నంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , తూర్పుగోదావరి జిల్లాలకు ప్రాంతీయ గోదామును ఏర్పాటు చేసి వ్యాక్సిన్ లను భద్రపరుస్తారని తెలిపారు. ప్రస్తుతం 17 లక్షల డోసుల టీకాలను నిల్వ చేసుకొనే సదుపాయం ఉందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ల ను కోల్డ్ స్టోరేజిలో ఉత్పత్తి కేంద్రాల నుంచి గోదాములు, వ్యాక్సిన్ వేసే కేంద్రాలకు పూర్తి భద్రతతో తరలిస్తారని తెలిపారు. సోమవారం నిర్వహించిన డ్రై రన్ పై నివేదికలు తెప్పించుకొని లోటు పాట్లను పరిశీలించి నుముందు జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియలో లోపాలు తలెత్తకుండా జాగ్రత్త వహిస్తామని తెలిపారు.
వ్యాక్సిన్ రకాన్ని బట్టి రెండవ డోసు 21 లేదా 28రోజులలో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి.సుధాకర్, ఇతర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

(Visited 25 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *