మానసిక ఒత్తిడి లో వ్యవసాయ సహాయకులు వేళాపాలా లేకుండా రాత్రి వేళ విధులను నిర్వహిస్తున్న వ్యవసాయ సహాయకులు.
అనకాపల్లి :
జిల్లాలో ఈ క్రాప్ బుకింగ్ వ్యవసాయ అధికారులకు గుదిబండగా తయారైంది.ఈ క్రాప్ చేసేందుకు వ్యవసాయ అధికారులు చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు. గత రెండు నెలలుగా వ్యవసాయ అధికారులు రైతుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఈ క్రాప్ కోసం రైతులకు వ్యవసాయ సహయ సహయకులు ఫోన్ ద్వారా ఈకెవైసి కోసం ప్రయత్నిస్తున్నా రైతులు ఎవరు ముందుకు రావడం లేదు. మరోవైపు జిల్లా అధికారులు వ్యవసాయ అధికారుల పీకమీద కత్తి పెట్ట ఈకెవైసి శత శాతం పూర్తి చెయ్యాలని తీవ్ర ఒత్తిడి తేవడం తో వ్యవసాయ సేవ సహాయకులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బయోమెట్రిక్ లేదా ఒటిపి ద్వారా ఈ క్రాప్ కి ఈకెవైసి లింక్ చెయ్యాలని అధికారులు చెప్తున్నా స్దానికేతర రైతులు ఎవరు స్పందించలేదు. ఈ రోజు బవులువాడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందినొక స్టోన్ క్రషర్ యజమాని కుటుంబ సభ్యునికి వారి భూమిని ఈ క్రాప్ చెయ్యడానికి వివరాలు కోసం ప్రయత్నం స్దానిక విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంటు ఫోన్ చెయ్యగా వారు ఈ క్రాప్ కి ముందుకు రాలేదు. ఆధార్ లింక్ కావడం వలన ఫోన్ నెంబరు ద్వారా వ్యవసాయ అధికారులు రైతులకు ఫోన్ ద్వారా ఈ క్రాప్ కోసం చేస్తున్న ప్రయత్నాలకు రైతులు సహకరించడం లేదు.ముఖ్యంగా ఒటిపి పై రైతులు మరింత భయపడుతున్నారు.వ్యక్తిగత విషయాలు చెప్పడానికి రైతులు ముందుకు రావడం లేదు. మరో వైపు జిల్లా కలెక్టర్ ఈ నెల 14 నాటికి ఈ క్రాప్ పూర్తి చెయ్యాలని ఆదేశించారు. కాని రైతులు ఎవరు ముందుకు రాకపోవడం కారణంగా ఈ నెల 14 నాటికి ఈ క్రాప్ పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం. అయితే ఇక్కడ విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ల పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెకుక చూస్తే గొయ్యి అనే సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఇటీవల అచ్యుతాపురం మండలం ఎదురువాడ గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి ఈ క్రాప్ కోసం రాత్రి పది గంటలు వరకు అక్కడే ఉండి ఈ క్రాప్ పరిస్థితి ని సమీక్షించారు. అధికారులు రాత్రి వేళ కూడా కుటుంబ సభ్యులను వదిలి ఇలా మాతో పని చెయ్యించడం ఎంతవరకు సమంజసమని వ్యవసాయ సహాయకులు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి వరకు పనిచెయ్యాలని ఒత్తిడి తెరవడం తో ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు వ్యవసాయ సహాయకులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. గత రెండు నెలలుగా నిద్రలు మానుకుని రైతుల వ్యవసాయ భూములకు ఈ క్రాప్ చేస్తున్నామని అంటున్నారు. గ్రామాల్లో భూములు ఉండి అటువంటి రైతులు స్దానికంగా ఉండకపోవడం వలన ఈ కెవైసి చెయ్యలేక పోతున్నామని అంటున్నారు. సన్న చిన్నకారు రైతులు ఈ క్రాప్ చేసుకోవడానికి ముందుకు వస్తున్న పది నుండి ఇరవై ఆపై ఎక్కవ భూమి ఉన్న రైతులు ఈ క్రాప్ పై ఆసక్తి చూపటం లేదు.కాని ప్రభుత్వం ఈ క్రాప్ పై ప్రత్యేక శ్రధ కనపరచి శత శాతం పూర్తి చెయ్యాలని పట్టుదలతో ఉంది.మరి పెద్ద రైతుల పై జిల్లా అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.