స‌మ‌ష్టిగా ఎన్నిక‌లు నిర్వ‌హిద్దాం

విశాఖపట్నం : మహా విశాఖపట్నం నగర పాలక సంస్థకు మార్చి నెలలో జరుగబోయే ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సమిష్టి కృషితో పని చేయాలని జి.వి.యం.సి. కమిషనర్ నాగలక్ష్మి. ఎస్. ఆదేశించారు. గురువారం జీవీఎంసీ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించాక మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో పాత సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ముందుగా కమిషనరు మాట్లాడుతూ గత సంవత్సరంలో జరుగవలసిన మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడినందున, తదుపరి మార్చి నెలలో జరుగవలసిన ఎన్నికల ప్రక్రియలపై అధికారులతో చర్చించారు. ఎన్నికలకు సంబందించిన స్ట్రాంగ్ రూమ్ లు, బ్యాలట్ బాక్స్ లు , పోలింగు సామగ్రి, వాహనాలు, మాళిక సదుపాయాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, స్టేషనరీ సామగ్రి మొదలగు విషయాలపై జోన్ల వారీగా అధికారులతో చర్చించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని సూచించారు.
ఈ ఎన్నికలకు సంబంధించిన పనులు వివరణ కోరగా ప్రధాన ఇంజనీరు ఎం. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ జరుగనున్న ఎన్నికలకు సంబంధించి జోన్ల వారీగా స్ట్రాంగు రూములు ఏర్పాటు చేస్తున్నామని, 1712 పోలింగ్ స్టేషన్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ, 204 రూట్లకు సంబంధించి కావలసిన వాహనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ పోలింగు స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం కమిషనరు మాట్లాడుతూ ఈ ఎన్నికల ప్రక్రియలో పోటీ చేస్తూ మరణించిన ఆ అభ్యర్థుల వివరాల నివేదిక సమర్పించాలని అదనపు కమిషనరు రమణి ని ఆదేశించారు. అలాగే ఈ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా విధులు నిర్వహించాలని, అందుకు కావలసిన టైం పెడ్యూల్ ను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రదాన ఇంజనీరు ఎం. వెంకటేశ్వర్లు, అదనపు కమిషనర్లు పి. ఆశాజ్యోతి, ఎ. వి. రమణి డా. వి. సన్యాసిరావు, వ్యయ పరిశీలకులు మంగపతిరావు, జె. డి. (అమృత) – విజయభారతి, సిసి.పి. విద్యుల్లం, పిడి. యుసిడి. వై. శ్రీనివాస రావు సి.యంట. హిచ్ డా. కె.ఎస్. ఎల్. జి. శాస్త్రి పర్యవేక్షక ఇంజనీర్లు వినయకుమార్, శాంసన్ రాజు, కె.వి.యెన్ రవి, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు

(Visited 68 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *