ఎన్నికల నిబంధనలు పాటించాలి
రాజకీయ పక్షాలతో జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి భేటీ
విశాఖపట్నం: మహా విశాఖ నగరపాలక సంస్థ మార్చి 10వ తేదీన జరగబోయే వార్డు మెంబర్ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి .ఎస్. కోరారు. శినివారం, జీవీఎంసి సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమనిబంధనలు రాజకీయపార్టీల నేతలకు వివరించారు. ఓటర్లు జాబితా మొదలుకొని పోలింగ్ నిర్వహణ వరకు సాగే వివిధ ప్రక్రియలు, పొలింగ్ స్టేషన్లి ఏర్పాటు, రిటర్నింగ్ అధికారుల వివరాలు. జోనల్ స్థాయి ప్రవర్తనా నియమావళి పరిశీలన నిమిత్తం ఏర్పాటుచేసిన వివిధ బృందాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాట్లు మొదలగు వాటి గురించి సవివరంగా తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలలో సుమారు 17.23లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుం టున్నారని కావున, ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 1712 పోలింగు స్టేషన్లలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా, అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని జాగ్రత్తగా పుస్తకంలో నమోదు చేయాలని సూచించారు. సమస్యాత్మకంగా, అత్యంత సమస్యాత్మకం గల పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, మరియు వీడియోగ్రఫీ నిర్వహిస్తామని మైక్రో లెవల్ అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. “పెయిడ్ న్యూస్’ లపై తగు జాగ్రత్త వహించాలని రాజకీయ పక్షాలకు సూచించారు. ఎన్నికల రోజు నాడు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో హాజరై ఓటు హక్కును వినియోగించుకొనలా రాజకీయపకాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ, జీవిఎంసి తరపున కూడా ఓటర్లలో ఓటు హక్కు వినియోగంపై చైతన్యం కల్పిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణపై ఏమైనా ఫిర్యాదులు చేయదలసినచో, రాజకీయ పార్టీల ప్రతినిదులకు తెలిపిన టెలిఫోన్ నెంబర్ల ద్వారా ఫిర్యాదులు చేయాలన్నారు. వాటిని పరిశీలించి తగు చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు.తదుపరి, పలు రాజకీయ పక్షాలు చేసిన ప్రశ్నలకు సవివరంగా జవాబు ఇస్తూ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు సహకరించాలని రాజకీయ పక్షపు ప్రతినిధులకు కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో జివిఎంసి అదనపు కమిషనర్లు ఆషాబ్యోతి, పి.వి.రమణి, డా. వి. సన్యాసిరావు ఎన్నికల విభాగాపు ప్రధాన ఇంచార్జ్ అప్పలనాయుడు, పలు రాజకీయ పక్షాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.