ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు : రాష్ట్ర వైసిపి కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్

అనకాపల్లి :

సచివాలయ పరిధిలో అత్యవసర పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సచివాలయం కు 20 లక్షల రూపాయలు నిధులను కేటాయించిందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ అన్నారు. తుమ్మపాల విద్యుత్ నగర్ లో డ్రెయినేజీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వ మని అన్నారు. గ్రామ సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు మాట్లాడుతూ డ్రెయిన్ దశలవారీ‌ నిర్మాణానికి 30 లక్షల రూపాయలు కేటాయించామని అన్నారు. ఈ తుమ్మపాల గ్రామ అభివృద్ధి కి మంత్రి అమర్నాధ్, ఎంపి సత్యవతి, దిలీప్ లు సహకరించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.. కార్యక్రమంలో అనకాపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు విల్లూరి సూర్యకుమారి చంద్రశేఖర్, వార్డు సభ్యులు జగది లక్ష్మి,భాస్కర్, సత్యనారాయణ,పొలమరశెట్టి కృష్ణ, తర్రా సత్యారావు,సచివాలయ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సచివాలయ3 కార్యదర్శి సత్యనారాయణ వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

(Visited 54 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.