విజ్ఞాన వినోదాల సమ్మేళనమే ఇంద్రజాలం

– దిశ డిస్పీ త్రినాథ్‌

విజ‌య‌న‌గ‌రం:విజ్ఞాన వినోదాల సమ్మేళనమే ఇంద్రజాలం అని దిశ డిస్పీ త్రినాథ్‌ అన్నారు. మంగళవారం ఉదయం ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతాంజలి పాఠశాలలో అలయన్స్‌క్లబ్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌-105 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారతదేశానికి చెందిన ప్రసిద్ధ ఇంద్రజాలికుడు పి సి సర్కార్‌ జన్మదినాన్ని యావత్‌ ప్రపంచము ఇంద్రజాలికుల దినోత్సవంగా జరుపుకోవడం భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు ప్రముఖ మెజీషయన్లు తమ మేజిక్‌షోతో అలరించారు. అనంతరం అంతర్జాతీయ స్ధాయి కలిగిన సి.హెచ్‌ శ్యామ్‌తో పాటు, క్రాంతికుమార్‌,శ్రీనివాసపండిట్‌, ఎస్‌ కె సలీమ్‌,పవన్‌ ఆశిష్‌, సత్యనారాయణలను అలయన్స్‌క్లబ్‌ అంతర్జాతీయ కమిటీ ఛైర్మన్‌ సముద్రాల గురుప్రసాద్‌, డి ఎస్పీ త్రినాథ్‌లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ కేబినెట్‌ సెక్రటరీ హిమబిందు, ప్రాంతీయ అధ్యక్షురాలు సుభద్రాదేవి, పాఠశాల కరస్పాండెంట్‌ గీతాంజలి శ్రీనివాస్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

(Visited 37 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *